కరోనా ఎఫెక్ట్: నిరసన అలా చేసిన న్యాయవాదులు

by Shyam |
కరోనా ఎఫెక్ట్: నిరసన అలా చేసిన న్యాయవాదులు
X

దిశ, మెదక్: సాధారణంగా నిరసన దీక్షలు రోడ్డు పక్కన టెంట్ వేసుకొని చేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ ఇంట్లో నిరసన దీక్షలు చేశారు న్యాయవాదులు. కరోనా నేపథ్యంలో ఇలా చేయాల్సి వచ్చిందని న్యాయవాదులు తెలిపారు. ఇంతకీ ఎందుకు చేశారంటే సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించే విధంగా అడ్వకేట్స్ వెల్ఫెర్ ట్రస్ట్ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలోని న్యాయవాది ఉప్పర మల్లేశం ఇంట్లో భౌతిక దూరం పాటిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. సీనియర్ న్యాయవాది ఎ.బాపూరావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులను ఆదుకోవాలని కోరారు. ఈ దీక్షలో న్యాయవాదులు ఎల్లం, యాదగిరి, బైండ్ల చంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed