- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ మృతిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
దిశ, హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళా కుటుంబానికి న్యాయం చేయాలని ఓ న్యాయవాది శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ తన భార్య విరోహిత తీవ్రమైన దగ్గుతో బాధపడుతుండగా, ఈ నెల 17వ తేదీన ముందుగా సన్‌షైన్ ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు న్యాయవాది అచ్యుతరావు పేర్కొన్నారు. అక్కడ ఆమెకు ఆక్సిజన్ అందించిన డాక్టర్లు అనంతరం బలవంతంగా డిశ్చార్జి చేయడంతో అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లారని, వారు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించడంతో బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి కూకట్‌పల్లిలోని హోలిస్టిక్ ఆస్పత్రికి తీసుకువెళ్లారని, అయితే అక్కడ కూడా వైద్యానికి నిరాకరించడంతో నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకురాగా వారు కూడా సదరు మహిళకు వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు. చివరకు కుటుంబ సభ్యులు చివరి ప్రయత్నంగా ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అక్కడ కూడా అదే సమాధానం వచ్చిందని, ఈలోగా విరోహిత మృతి చెందిందని అచ్యుతరావు తెలిపారు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారన్నారు. అనారోగ్యంతో ఉన్న మహిళను చేర్చుకుని వైద్యం అందించవలసిన ఆస్పత్రులు నిరాకరించడంతో ఆమె సకాలంలో వైద్య సేవలు అందక మరణించిందన్నారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి సదరు హాస్పిటల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేలా డీఎంఈతో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన హెచ్ఆర్సీని కోరారు.