ఆ వార్తను చూసి చలించిపోయిన లా విద్యార్థి.. HRCలో ఫిర్యాదు

by Sridhar Babu |   ( Updated:2021-12-06 04:23:19.0  )
ఆ వార్తను చూసి చలించిపోయిన లా విద్యార్థి..  HRCలో ఫిర్యాదు
X

దిశ, మణుగూరు : బీటీపీఎస్ మెయిన్ రోడ్డుపై అక్టోబర్ 24వ తేదీన లారీ ఢీ కొట్టిన ఘటనలో తండ్రి ఇద్దరు పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ఒక న్యాయ విద్యార్థి తన ముందుకు వచ్చిన వార్త కథనాలపై, తండ్రి ఇద్దరు పిల్లలు మరణ వార్త చూసి చలించిపోయారు. దీంతో బలహీన వర్గాలకు చెందిన వాళ్లని తెలుసుకొని దీనికి కారణం ఏంటని ఆలోచించి..? ఎందుకు ఇలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ? వీళ్లకు చట్టపరంగా ఏ సహాయం అందుతుందని, మానవ హక్కుల కమిషన్‌లో, జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు.

బీటీపీఎస్ ఉన్న ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఉంటుందని, బొగ్గు లారీలు అతివేగంగా తిరుగుతుంటాయని, నిబంధనలు ప్రకారం రద్దీ ఉన్న ప్రాంతంలో కనీసం 10 కిలోమీటర్ల మేరకు డబుల్ రోడ్డు వేయాలని, దానికోసం గతంలోనే ప్రభుత్వం నుండి ప్లానింగ్ జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని డబుల్ రోడ్డు నిర్మాణం చేసే విధంగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, రోడ్డు యాక్సిడెంట్లో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలనే విధంగా ఆ కుటుంబానికి ఉపాధి కల్పించాలని ఉద్దేశ్యంతోనే మానవ హక్కుల కమిషన్ ఛైర్మెన్‌కు ఫిర్యాదు చేశామని మణిదీప్ తెలిపారు. ఈ క్రమంలో విచారణ జరిపిన మానవ హక్కుల కమిషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఈ విషయంపై బాధితులకు న్యాయం చేసి సమాచారాన్ని లా విద్యార్థి మణిదీప్‌కి పంపివ్వాలని ఆదేశాలను జారీ చేసింది.

లా విద్యార్థి మణిదీప్ వివరణ

బిటీపీఎస్ మెయిన్ రోడ్డుపై అక్టోబర్ 24వ తేదీన లారీ ఢీ కొట్టిన ఘటనలో తండ్రి ఇద్దరు పిల్లలు మరణించిన విషయం మనస్సును కలచి వేసిందన్నారు. అందుకే ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఉద్దేశ్యంతోనే మానవ హక్కుల కమిషన్ ఛైర్మెన్ ను కలిశానని ఆయన తెలిపారు. బీటీపీఎస్ మెయిన్ రోడ్డుపైన యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed