పెళ్లి అంటే ఫైర్ అవుతున్న లావణ్య

by Anukaran |   ( Updated:2020-10-17 02:30:38.0  )
పెళ్లి అంటే ఫైర్ అవుతున్న లావణ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. ఈ చదువులు నా వల్ల కావడం లేదు’ అందాల రాక్షసి సినిమాలో అందాల రాశి లావణ్య త్రిపాఠి డైలాగ్. ఈ సినిమాతోనే ఫుల్ పాపులారిటీ కూడా వచ్చింది భామకు. అయితే ఇదే ప్రశ్న సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో అడిగిన అభిమానులకు తనదైన రీతిలో ఆన్సర్ చేసింది లావణ్య.

అందాల రాక్షసి సినిమా నుంచి మీరు మీ నాన్నను పెళ్లి చేయమని అడుగుతున్నారనుకుంటా అన్న ప్రశ్నకు నవ్వుతో బదులిచ్చిన లావణ్య.. మీ వేలికి ఉంగరం ఉంది త్వరలో పెళ్లా? అన్న ప్రశ్నకు మాత్రం కొంచెం ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఏం.. అమ్మాయిలు వాళ్ళకి వాళ్లు ఉంగరం కొనుక్కోకూడదా ఏంటి? అని ప్రశ్నించింది. ఇది నా పుట్టినరోజున నాకు నేనే ఇచ్చుకున్న బహుమతి అని చెప్పింది. మా అమ్మానాన్నలు కూడా నా పెళ్లి విషయంలో ఇంత వర్రీ అవట్లేదు.. మీకెందుకు అంత బాధ అని సమాధానమిచ్చింది.

అన్నం, పప్పు, పచ్చడి ఫేవరెట్ ఫుడ్ అని తెలిపిన లావణ్య.. స్ట్రాంగ్ టీ ఇష్టపడతానని చెప్పింది. ఎక్కువగా ఆందోళన చెందినప్పుడు అలాంటి ఆలోచనలకు దూరంగా ఉంటూ.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తానని తెలిపింది. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లను సపోర్ట్ చేస్తానని చెప్పింది లావణ్య.

Advertisement

Next Story