2020 ఈ దారుణాలను ఆపెయ్ : లావణ్య

by Anukaran |   ( Updated:2020-08-05 03:16:01.0  )
2020 ఈ దారుణాలను ఆపెయ్ : లావణ్య
X

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి.. లాక్‌డౌన్ టైమ్‌లో మూడు నెలల పాటు హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. ఓ వైపు తోచిన సాయాన్ని చేస్తూ, మరో వైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేది. ఈ టైమ్‌లో ఫొటో షూట్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన లావణ్య.. ఇటీవలే డెహ్రాడూన్‌లోని తన ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం వాళ్ల అమ్మతో పాటు తన ఫేవరెట్ పెంపుడు కుక్కతో హ్యాపీగా గడిపేస్తూ.. సోషల్ మీడియాలో ఆ విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ రోజు ట్విట్టర్ వేదికగా.. భిన్నమైన అంశాల మీద తన అభిప్రాయలను పంచుకుంది ఈ బ్యూటీ.

లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం భారీ పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా, నాలుగు వేల మందికి పైగా గాయాలయ్యాయి. భవనాల శిథిలాల కింద ఎంతోమంది చిక్కుకుపోయారు. పేలుడుకు కారణాలు ఏంటనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ ఘటనపై స్పందించిన లావణ్య.. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది. 2020 ప్లీజ్ ఇక్కడితో ఆపేయ్.. హార్ట్ బ్రేకింగ్’ అంటూ భావోద్వేగానికి గురైంది. ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్ హీరో సుశాంత్‌‌ కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించాలని కూడా లావణ్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభ్య‌ర్థించిన విషయం తెలిసిందే.

వీటితో పాటు అల్లు శిరీష్‌తో కలిసి నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా.. అప్పుడే 4 సంవత్సరాలు పూర్తయిపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story