- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు తెర ‘లవుడు’ ఇకలేరు!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు తెర లవుడు కన్నుమూశాడు. ‘లవ కుశ’ సినిమాలో బాల నటుడిగా మెప్పించి ప్రశంసలు అందుకున్న నాగరాజు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో మరణించారు. నాగరాజు మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టాలీవుడ్ క్లాసికల్ మూవీ ‘లవ కుశ’.. ఎన్టీఆర్, అంజలీ దేవి సీతారాములుగా తెరపై ఎంత గొప్పగా జీవించారో.. వారి కుమారులుగా లవ కుశ పాత్రధారులు కూడా అంతే అద్భుతంగా తమ పాత్రలకు న్యాయం చేశారు. లవుడిగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించిన ఈ సినిమాను లలిత శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకర్ రెడ్డి నిర్మించారు. సి. పుల్లయ్య, సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఆ చిత్రం.. పూర్తి కలర్‌లో చిత్రీకరణ జరుపుకున్న మొదటి తెలుగు సినిమాగా నిలిచింది.
‘భక్త రామదాసు’ సినిమాలో నాగయ్య కొడుకుగా కనిపించిన నాగరాజు.. లవకుశ విజయంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. 1963లో విడుదలైన లవకుశ చిత్రం ఉత్తర రామాయణం ఆధారంగా తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకుంది. అయితే ముందుగా సి. పుల్లయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అనారోగ్య కారణాల వల్ల చిత్రీకరణకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన కుమారుడు సీఎస్ రావు దర్శకత్వ బాధ్యతలను చేపట్టి సినిమాను పూర్తి చేశారు.