- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత అంబులెన్స్ సేవలను మంగళవారం సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో ఈ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కొవిడ్ -19 బాధితులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండు అంబులెన్స్ లు 24గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. 94906 17234, 94906 17111 నెంబర్లకు కాల్ చేసి సేవలు పొందాలన్నారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ప్రధాన కార్యదర్శి కృష్ణ, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) వైస్ చైర్మన్ గగన్ డీపీ కోహ్లీ, యువత ఎన్జీవో ప్రతినిధులు సాకేత్, ప్రశాంత్, దాస్ గుణాలన్ పాల్గొన్నారు.