కన్నడ ఇండస్ట్రీలో విషాదం... డైరెక్టర్ మృతి..!

by Shiva |
కన్నడ ఇండస్ట్రీలో విషాదం... డైరెక్టర్ మృతి..!
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శాండల్ వుడ్ నటుడు, దర్శకుడు టపోరి సత్య కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్ తో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నటుడు, దర్శకుడు సత్య తల్లి మాట్లాడుతూ.. 'సత్య ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు. అతనెప్పుడు తన తుది శ్వాస వరకు సినిమాలకే అంకితమయ్యాడు. నన్ను, కుటుంబాన్ని ఆదుకుంటానని సత్య మాటిచ్చాడు. అతని మరణం మమ్మల్ని మరింతగా కుంగదీస్తుంది' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సత్య భౌతికకాయాన్ని బనశంకరిలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియాలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story