- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రాఫిక్ అలెర్ట్.. ఈ మార్గాల్లో ఆంక్షలు, మళ్లింపులు
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పలు మార్గాల్లో వాహనాలను దారిమళ్లించనున్నారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును పూర్తిగా మూసివేశారు.. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనుంది.
ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు:
వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ వరకు ఇరువైపులా వాహనాలకు అనుమతి లేదు.
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.
ఇక్బాల్‌మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి ట్రాఫిక్ అనుమతి లేదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపునుంచి మళ్లిస్తున్నారు.
ఇక తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
అఫ్టల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి.
ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు పంపిస్తారు.
బీఆర్‌కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్‌మార్గ్ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తున్నారు.
ఖైరతాబాద్ గణేశ్ లేన్ వైపు నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కంపౌండ్ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్ లేన్‌లోకి పంపిస్తారు.
మింట్‌లేన్ నుంచి బడాగణేశ్ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తున్నారు.