- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మందుబాబులకు గుడ్ న్యూస్... తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: మద్యం ప్రియులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. తమిళనాడులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆదాయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అన్ని ప్రాంతాల్లో.. ఇప్పటి వరకు బార్లు, అనుమతి ఉన్న ప్రదేశాల్లోనే మాత్రమే మద్యం సేవించే అవకాశం ఉండేది. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజ నిర్ణయంతో బహిరంగ ప్రదేశాల్లోనూ మద్యం సేవించే అవకాశాన్ని మందుబాబులకు కల్పిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కల్యాణ మండపాలు, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాల్లో మద్యం అందించేందుకు ప్రత్యేక లైసెన్సింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ నిర్ణయంపై జయలలిత గతంలో మద్యం అమ్మకాలపై తీసుకున్న కఠిన నిర్ణయాలను సమీక్షించి స్టాలిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వినపడుతున్నాయి. పర్యాటకులు ఇబ్బంది పడే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యల కారణంగా దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది.
Also Read..