- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో కొంతమంది టూర్లకు ప్లాన్ చేస్తుంటారు. మళ్లీ సెలవులు ముగిసేలోగా ఎక్కడికైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నవారు ఉన్నారు. పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా కిటకిటలాడుతుంటాయి. ఇప్పటికే తిరుమలలో కూ రద్దీ మొదలైంది. మరి మీరు కూడా వేసవిలో తిరుపతి టూర్ కు ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.
గోవిందం పేరుతో రైల్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ. ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి రెండు, మూడు రోజుల్లో తిరుపతి టూర్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.4వేల లోపే కావడం విశేషం. ఈ ప్యాకేజీ ప్రత్యేకత ఏంటంటే ఇందులోనే తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్ కవర్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం.. టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఐఆర్‌సీటీసీ సైట్ కు వెళ్లి తెలుసుకోండి.
Also Read..