నేను మీ ప్రతినిధిని.. మీ కోసమే పనిచేస్తున్నా

by Shyam |
నేను మీ ప్రతినిధిని.. మీ కోసమే పనిచేస్తున్నా
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నేను మీ ప్రతినిధిని, మీరు నాకిచ్చిన అవకాశంతో మీకోసం పనిచేస్తున్నా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మీలో నన్ను చూసుకుంటున్నా నన్ను మీ స్నేహితుడుగా భావించి పని తీసుకోండని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదివారం వనపర్తి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పనిచేసే వారికి ప్రజల ఆశీస్సులుంటాయని, రాష్ట్రంలో ప్రతిష్టాత్మక మార్కెట్ గా వనపర్తి మార్కెట్ ను తీర్చిదిద్దుతామాని చెప్పారు. వేరుశనగ దిగుబడిలో మన ప్రాంతం దేశంలోనే రికార్డ్ సృష్టించిందని, భవిష్యత్ లో మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి రాకతో ఈ ప్రాంతంలో పంటలసాగు పెరిగిందని, పనిచేయాలన్న తపన ఉంటే మనసుపెట్టి పనిచేస్తే దానికి ప్రజల ఆశీస్సులు నిరంతరం ఉంటాయని పేర్కొన్నారు.

వ్యవసాయ పనులు పెరగడంతో కూలీల కొరత ఏర్పడిందని, ప్రజలకు ఎంత బతుకుదెరువు లభించిందన్నది ముఖ్యమని చెప్పారు. ప్రజల కోసం పనిచేశామని, వారికి ఉపాధి కల్పించామని ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో మిగిలిన అన్ని గ్రామాలు, తండాలకు నీళ్లిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 54 మినీలిఫ్టులు ఏర్పాటు చేసి నీరందిస్తున్నామన్నారు. రైతువేదికల నిర్మాణంతో రైతులకు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల మెళుకువలు నేరుగా అందుబాటులోకి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు.

Advertisement

Next Story