బక్రీద్ "ఖుర్భాని" బీదల పాలిట మహాదానం

by Shyam |
బక్రీద్ ఖుర్భాని బీదల పాలిట మహాదానం
X

దిశ, సిద్దిపేట: బక్రీద్ సందర్భంగా రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు “బక్రీద్ ఖుర్భాని ముబారక్” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను కళావంతం చేస్తాయన్నారు.

బక్రీద్ ఈదుల్ జుహ పర్వదినం త్యాగానికి, సహనానికి ప్రతీక అని, పండుగ రోజు ధనవంతులు తమకు కల్గిన సంపదలో బీదలకు రెండున్నర శాతం వస్తువు రూపంలో పంచి అల్లా కృపకు పాత్రులు కావాలని ఖురాన్ భోదిస్తుందని, పండుగ నాడైన బీదవాడు కడుపునిండా తినాలని ఇచ్చే “మహాదానం ఖుర్భాని” అంతర్భావ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. బక్రీద్ ప్రపంచ మానవాళికి త్యాగం, సహజీవనం, ఐక్యత, శాంతి, సంతోషాలను అందిస్తుందని, అందించాలని ప్రపంచం కరోనావైరస్ ను అధిగమించాలని, పండుగనాడు భౌతిక దూరం పాటించి బక్రీద్ ముబారక్ తెలియజేసుకోవాలన్నారు. జులేఖ రుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం, ఎంటెక్ విద్యార్థిని, నేచర్ ఆర్టిస్ట్ రూబినారుస్తుం, రహీం రిజ్వాన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed