- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్.. ఈమెను కాపాడండి
దిశ, మానకొండూరు: అమ్మానాన్న లేని ఆ యువతిని మాయమాటలతో మచ్చిక చేసుకున్నాడు. వివాహం చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. భూతవైద్యం పేరుతో ఆ అమ్మాయిని అపస్మారక స్థితికి పంపించాడు. ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్న ఓ యువతిని కాపాడాలంటూ పలువురు కోరుతున్నారు.
సంఘటనా వివరాల్లోకి వెలితే… కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలనుకున్న ఆ యువతి హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా మంచిర్యాల జిల్లా జైపుర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ఆ యువతిని బుట్టలో వేసుకున్నాడు. దీంతో ఆ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండు నెలల పసికందు ఉన్నదని కూడా చూడకుండా మల్లశ్, అతని కుటుంబ సభ్యులు ఆ యువతికి భూత వైద్యం పేరిట చిత్రహింసలకు గురి చేశారు. భూత వైద్యుని అత్యుత్సాహంతో చేసిన ప్రయత్నం వికటించి ఆమె చిన్న మెదడుకు గాయమైంది. దీంతో ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ఇది గమనించిన భీం ఆర్మీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ స్వైరో ఆమెను కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే కోవిడ్ కారణంగా ఆమెను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో బాధితురాలిని ప్రతిమ హస్పిటల్ లో చికిత్స అందించేందుకు చొరవ చూపించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆమెకు మోసం చేసిన మల్లేశ్ ను పట్టుకున్నప్పటికీ తప్పించుకు తిరుగుతున్నాడని శ్రీనివాస్ వివరించారు. బాధితురాలికి వైద్యం అందించేందుకు చొరవ చూపాలని ఆయన కోరుతున్నారు. అలాగే ఆ యువతి జీవితంతో చెలగాటమాడిన మల్లేశ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.