గండిని పూడ్చిన పోలీసులు

by Sridhar Babu |
గండిని పూడ్చిన పోలీసులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: చెరువుకు పడ్డ గండిని పూడ్చడంలో పోలీసులు తమవంతు పాత్ర పోషించారు. ఇళ్లలోకి నీరు చొరబడుతున్న సమాచారం అందుకున్న పోలీసులు ప్రజాప్రతినిధులను, అధికారులను సమన్వయ పర్చి గండిని పూడ్చారు.

వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గాండ్ల చెరువుకు గండి పడింది. ఈ గండి ద్వారా వస్తున్న నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరని సుల్తానాబాద్ సీఐ మహేందర్ రెడ్డికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఆయన స్థానిక ఎస్సై ఉపేందర్, బ్లూ క్లోట్స్ సిబ్బందితో కలిసి చెరువు వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గండిని అలాగే వదిలేస్తే చెరువులోని నీరంత వృథాగా పోవడంతో పాటు అక్కడి నివాసాలు కూడా జలమయం కానున్నాయని గ్రహించారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయ పరిచి సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గండిని జేసీబీలతో పూడిపించి నీటిని నిలువరించగలలిగారు. పోలీసుల తీసుకున్న చొరవ పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story