టైర్లలోంచి నీళ్లు తీసిన కలెక్టర్

by  |
టైర్లలోంచి నీళ్లు తీసిన కలెక్టర్
X

దిశ, కామారెడ్డి: వర్షాకాలంలో విష జ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల పది నిమిషాలకు నీటి నిల్వలను శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన కామారెడ్డి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లోని టైర్లలో ఉన్న నిలువ నీటిని తీసి శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తుగా పఠిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా లార్వా దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోని పూల కుండీలలో, కూలర్లు, టైర్లలో, డ్రమ్ములలో, పాత్రలలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. తద్వారా దోమలు పునరుత్పత్తి చెందకుండా దోమలు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు నివారించవచ్చని, ప్రజలు తమ ఇండ్లలో నీరు నిల్వ ఉండకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed