ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి : ఎలిమినేటి

by Shyam |
ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి : ఎలిమినేటి
X

దిశ, భువనగిరి: మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలోని ఊర చెరువులో 20 లక్షల చేపపిల్లలు వదిలిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 80 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే రూ. 6లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం అందజేస్తుందని ఆయన తెలిపారు.

దళారులకు చేపలిచ్చి మోసపోవద్దని ఆయన సూచించారు. మత్స్యకారులకు వలలు, గ్రామాల్లో, సంతల్లో చేపలు విక్రయించేందుకు వాహనాలను సబ్సిడీపై ప్ర భుత్వం అందజేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లుగారి భాగ్యలక్ష్మీ శ్రీనివాస్, మత్స్యశాఖ జిల్లా అధికారి షకీలా భాను, మత్స్య పరిశ్రమ శాఖ సహకార సంఘం అధ్యక్షులు గణేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed