- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అద్దెకు బదులుగా అది అడుగుతున్న ఇంటియజమానులు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలు ఏమో గానీ, జీవితాలు అస్తవ్యస్తమై ఏవేవో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కరోనా క్వారంటైన్ కారణంగా అమెరికాలోని నగరాల్లో అద్దెకు ఉండేవారికి ఒక కొత్త సామాజిక సమస్య వచ్చింది. అద్దె కట్టడానికి డబ్బుల్లేవు. కట్టకపోతే ఇంటి యజమాని ఊరుకోడు. మరి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిన వారికి ఇంటి యజమానులతో ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అక్కడి ఎన్‌బీసీ న్యూస్ ఛానల్ నివేదిక ప్రకారం ఇంటి యాజమానులు అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్న వారిని డబ్బుకు బదులుగా తమ కామకోరికలు తీర్చాలని ఇబ్బందిపెడుతున్నారట.
ఈ విషయం గురించి చాలా మంది న్యాయవాదుల దగ్గర కేసులు నమోదవుతున్నాయి. గత నెల రోజులుగా ఇలా ఇంటియాజమానులు తమను వేధిస్తున్నారంటూ వచ్చిన కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్‌బీసీ తెలిపింది. కరోనా కారణంగా నాలుగు వారాల్లో 22 మిలియన్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇళ్ల అద్దెలు కట్టలేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు. హవాయి స్టేట్ కమిషన్ అందించిన వివరాల ప్రకారం యజమానులు తమను సెక్స్ కోరికలు తీర్చమంటున్నారని, తప్పుడు మెసేజ్‌లు పంపిస్తున్నారని, అసభ్యం ప్రవర్తిస్తున్నారని మహిళలు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. వీటితో పాటు గృహహింస కేసులు కూడా అధికంగా పెరిగినట్లు వెల్లడించింది.
తెలంగాణలో కూడా మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఇంటియజమానులు అద్దె గురించి ఇబ్బంది పెడితే 100కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags – corona, covid, lockdown, landlords, america, US, perverts