భూసేకరణ పనులు పూర్తి చేయాలి: ప్రశాంత్ రెడ్డి

by Shyam |
భూసేకరణ పనులు పూర్తి చేయాలి: ప్రశాంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి ఆలయం, పుష్కరిణి సహా సూట్లు, విల్లాలు ఈనెలలోపే పూర్తికావాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. రింగ్​రోడ్డు పనుల భూసేకరణను త్వరగా పూర్తిచేయాలంటూ యాదాద్రి జిల్లా కలెక్టర్​‌ను ఫోన్​లో ఆదేశించారు. యాదాద్రిని ప్రపంచంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. సీఎం ఆలోచనల మేరకు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికతను సంతరించుకునే విధంగా నిర్మాణాలు జరగాలని ఆదేశించారు.

యాదాద్రి పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఆలయం, పుష్కరిణి, కల్యాణ కట్ట, ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలు, రింగ్ రోడ్డు పనుల పురోగతిపై ఆరా తీసిన మంత్రి.. ఈనెలలోపే పనులు పూర్తికావాలని స్పష్టం చేశారు. రూ.143 కోట్లతో నిర్మిస్తున్న రింగ్ రోడ్డు భూసేకరణ ఈనెలలోపు పూర్తిచేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్​ను ఫోన్లో ఆదేశించారు. యాదాద్రి పనుల రోజువారీ వర్క్​ఛార్ట్​ తయారుచేసుకోవాలని అధికారులకు సూచించారు. పనుల పురోగతిపై ఈఎన్సీ ప్రతివారం సమీక్షించాలని ఆదేశించారు. యాదాద్రి పరిసర ప్రాంతాలంతా పచ్చదనంతో పరిఢవిల్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.a

Advertisement

Next Story

Most Viewed