- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గిరిజన బాలికపై అత్యాచారం.. మంత్రి సత్యవతి రాజీనామా చేయాలి
దిశ, దామరచర్ల: హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన గిరిజన బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఎల్‌హెచ్‌పీఎస్(లంబాడ హక్కుల పోరాట సమితి) నాయకుడు అడావత్ నాగునాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గిరిజనులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా.. స్పందించని మంత్రి ఉంటే ఏంటి లేకుంటే ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక అత్యాచారానికి నైతిక బాధ్యత వహించి, వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘దిశ’ ఘటనలో నిందితులను కాల్చి చంపిన మాదిరిగానే ఈ నిందితుడిని కూడా కాల్చి చంపాలని కోరారు.
అంతేగాకుండా.. మహిళలు, బాలికలు, పసికందులపై జరుగుతున్న దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని మండిపడ్డారు. అభంశుభం తెలియని గిరిజన బాలికను దారుణంగా హింసించి, అత్యాచారం చేసి చంపినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని, అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నామని ఆందోళన చెందారు. వెంటనే బాధిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల పరిహారం, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. వారి వెంట ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సైదులు, లావూరి రవి నాయక్ తదితరులు ఉన్నారు.