తల్లీబిడ్డను రక్షించిన లేక్ పోలీసులు

by Sridhar Babu |   ( Updated:2020-08-30 06:47:36.0  )
తల్లీబిడ్డను రక్షించిన లేక్ పోలీసులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో సందర్శకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ మరింత పెరిగింది. ఓ వైపు దిగువకు వెళుతున్న నీటి ప్రవాహపు చప్పుళ్లు, మరో వైపున పర్యాటకుల సందడితో కిటకిటలాడుతున్న ఎల్ఎండీ కట్టపైకి 25 మహిళ చిన్నారితో సహా వచ్చింది. ఆమెను గమనించిన లేక్ పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. సూసైడ్ చేసుకునేందుకు వచ్చిన ఆమెను లేక్ పోలీసులు అడ్డుకున్నారు.

తన భర్త, అత్తలు అదనపు కట్నం కోసం వేధింపులకు, చిత్రహింసలకు గురిచేస్తుండటంతో జీవితంపై విరక్తి చెంది, 9 నెలల పసి బిడ్డతో కలిసి ఎల్ఎండీలో దూకి ఆత్మహత్యాయత్న చేసుకోవాలని భావించానని పోలీసులకు తెలిపింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న తన భర్త ఆదివారం ఉదయం కూడా శారీరకంగా హింసించాడని ఆవేదనతో తెలిపింది. లేక్ ఎస్‌ఐ శ్రీనాథ్ డ్యాం వద్దకు చేరుకుని బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చి త్రీ టౌన్ పోలీసులకు అప్పగించారు. మహిళతో పాటు పసికందును రక్షించిన పోలీసులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు. కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed