మహిళ ప్రైవేట్‌ భాగాల నుంచి కరోనా శ్యాంపిల్స్‌ సేకరణ..

by  |
మహిళ ప్రైవేట్‌ భాగాల నుంచి కరోనా శ్యాంపిల్స్‌ సేకరణ..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న సమయంలో.. కొంతమంది ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ కరోనా టెస్టుల పేరుతో కామవాంఛను తీర్చుకుంటున్నారు. సాధారణంగా ముక్కు, గొంతు నుంచి శ్యాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, కరోనా పరీక్ష చేయించుకునేందుకు ప్రైవేట్ ల్యాబ్‌కు వచ్చిన ఓ మహిళపై కన్నేసిన ల్యాబ్ టెక్నీషియన్‌ ఆమె ప్రైవేట్ భాగాల్లో నుంచి శ్యాంపిల్ సేకరించి పైశాచిక ఆనందం పొందాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.

అసలేం జరిగిందంటే: మహారాష్ట్రలోని అమరావతి జిల్లా బద్నేరా ప్రాంతానికి చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. అదే మాల్‌లో కలిసి పనిచేసే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమెకు తెలియజేశాడు. ముందుజాగ్రత్తగా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. ఈ నేపథ్యంలోనే తానే స్వయంగా ఆ మహిళను ఈ నెల 28న ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ముందుగా ముక్కు నుంచి శ్యాంపిల్ సేకరించాడు. ఆ తర్వాత మహిళకు పాజిటివ్ అని తేలిందని రిపోర్టు ఇచ్చాడు.

పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆ మహిళ ఆందోళనలో ఇంటికెళ్లింది. కాగా, ఆమె అందంపై కన్నేసిన సదరు ల్యాబ్ టెక్నీషియన్ ఎలాగైన తన కామవాంఛ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. నెంబర్ కూడా తీసుకుని బాధితురాలికి కాల్ చేశాడు. మళ్లీ మీరు ఒకసారి టెస్టు చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. కరోనా భయంతో బాధితురాలు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చింది. ఇదే ఆసరాగా తీసుకున్న ల్యాబ్ టెక్నీషియన్‌ టెస్టులు చేయాలంటూ.. ఏకంగా మహిళ ప్రైవేట్ భాగాల్లో నుంచి శ్యాంపిల్ సేకరించి పైశాచిక ఆనందం పొందాడు. పైగా శ్యాంపిల్ పరీక్షించిన తర్వాత నెగెటివ్ వచ్చిందని సొల్లు కబుర్లు చెప్పాడు.

అతడి ప్రవర్తనపై అనుమానం కలిగిన బాధితురాలు సందేహంతో ఇంటికి వెళ్లింది. జరిగిన విషయం కాస్తా తన సోదరుడికి చెప్పింది. దీంతో ఆగ్రహించిన అతడు సోదరిని తీసుకొని నేరుగా బద్నేరా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. జరిగిన విషయం మొత్తం ఎస్సైకి వివరించి.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయించాడు. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఓ వైపు కరోనా భయంతో ప్రజలు చస్తుంటే.. టెస్టుల పేరుతో కామ క్రీడలు చేయడమేంటని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed