బ్రేకింగ్ : స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్..

by Sridhar Babu |   ( Updated:2021-11-20 05:47:41.0  )
బ్రేకింగ్ : స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి ఎల్ రమణ, సిట్టింగ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనల్ చేశారు. వీరిద్దరూ నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యమంత్రి వీరికి పార్టీ బీ ఫామ్స్ అందజేసే అవకాశాలు ఉన్నాయి. భాను ప్రసాద్ రావు పేరు చివరి నిమిషంలో ఖరారు చేసినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ బై పోల్ సందర్భంగా టీటీడీపీ స్టేట్ చీఫ్ పోస్టుకు రాజీనామా చేసి ఎల్ రమణ గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం మేరకు మండలికి పంపించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

నారదాసుకు ప్రత్యామ్నాయం..

మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుకు ప్రత్యామ్నాయ పదవిని కట్టబెట్టే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానంలో మరో కీలక పదవిని ఇవ్వనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

epaper – 4:00 PM TS EDITION (20-11-21) చదవండి

Advertisement

Next Story