జగన్‌పై అభిమానంతో గెలిపించాం

by srinivas |
జగన్‌పై అభిమానంతో గెలిపించాం
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిపై.. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీని మోసం చేసి బయటకు వెళ్లిన వ్యక్తిని.. 2019లో జగన్ మళ్లీ పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి మళ్లీ కార్యకర్తలకు అన్యాయం జరిగేలా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో స్థానికేతరుడైన అతడికి టికెట్ ఇచ్చినా.. సీఎం జగన్‌పై ఉన్న అభిమానంతో గెలిపించామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed