అప్పుడు పారిపోయాడు.. ఇప్పుడు చితక్కొట్టాడు

by srinivas |
అప్పుడు పారిపోయాడు.. ఇప్పుడు చితక్కొట్టాడు
X

అప్పుడు పారిపోయాడు.. ఇప్పుడు చితక్కొట్టాడంటే ఎవరు? ఎందుకు పారిపోయారు? ఎవర్ని చితక్కొట్టాడన్న అనుమానం వచ్చిందా?.. అయితే చదవండి.. కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ఐ విష్ణు నారాయణ పేరు గుర్తుందా? గత నెలలో అధికారులు మందలించారన్న మనస్తాపంతో, ఇదే తన చివరి మెసేజ్ అంటూ వాట్సాప్ లో సమాచారాన్ని ఇచ్చి అదృశ్యమైన పోలీసు అధికారి. అతని మెసేజ్ తో కంగారుపడిన అధికారులు, గాలింపు చర్యలు చేపట్టగా, తీరిగ్గా బయటకు వచ్చాడు.

ఇప్పుడాయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ విధుల్లో ఉన్న విష్ణు నారాయణ, కర్నూలు జిల్లాలోని నాగులవరం గ్రామంలో ఓ చిల్లర కొట్టు యజమానిని చితకబాదాడు. అంతటితో ఊరుకోకుండా ఆ షాపులోని సరుకులను వీధిలో పడేశాడు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అయింది. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Tags: kurnool district, vishnu narayana, si, attck on shope owner, social media

Advertisement

Next Story