- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమ్మినేని ఓ ఫ్రాడ్: కూన రవికుమార్
దిశ ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కూన రవికుమార్‌కు సంబంధించిన ఆడియో రికార్డ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియో టేపులో తేడా వస్తే లేపేస్తానంటూ వైఎస్సార్సీపీ నేత మోహన్‌ను బెదిరించడం కలకలం రేపుతోంది. వాస్తవానికి పొందూరుకి చెందిన మోహన్ గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉండేది. పొందూరులోని మోహన్ బిల్డింగ్‌లోనే టీడీపీ కార్యాలయం ఉంది. గత ఎన్నికల ముందు ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. తాజాగా తమ పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తోందని, టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోరుతూ మోహన్ కూన రవికుమార్‌కు ఫోన్ చేశారు.
దీంతో ఆయన ఆఫీసును ఖాళీ చేసే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన బిల్డింగ్‌ను ఖాళీ చేయాల్సిందేనని మోహన్ పట్టుబట్టారు. దీంతో రవికుమార్… మర్యాదగా ఉండకపోతే మర్యాద తప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. తేడా వస్తే లేపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వాయిస్ రికార్డు జిల్లాలోని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఆడియో టేపుపై కూన రవికుమార్ వివరణ ఇస్తూ.. 2009 నుంచి ఆ బిల్డింగ్‌లో తాను రెంట్‌కు ఉన్నానని చెప్పారు. 2012లో మోహన్‌తో కలిసి ఆ బిల్డింగ్ కొనుగోలు చేశానని వెల్లడించారు. పార్టీ ఆఫీసు కోసం ఆ బిల్డింగ్‌ను జాయింట్‌గా కొనుగోలు చేశామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో తాను వేరే చోట ఉండడంతో… టీడీపీలో నమ్మకమైన కార్యకర్తగా ఉన్న గుడ్ల మోహన్ పేరిట దానిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు.
గత ఎన్నికల్లో పార్టీ మారడంతో ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాం అతనిపై ఒత్తడి చేశారని, దీంతోనే మోహన్ పార్టీ ఆఫీసుకు వైట్ కలర్ వేయించాడని, ఇప్పుడు బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని… ఈ విషయం ఆయనే తనకు చెప్పారని వెల్లడించారు. తన ఫోన్‌కాల్ రికార్డు చేయాలన్న లక్ష్యంతోనే మాట్లాడి రెచ్చగొట్టారని, ఇప్పడది ప్లాన్డ్‌గా వైరల్ చేశారని ఆరోపించారు. ఆ బిల్డింగ్ తమ ఇద్దరిదీ అని ఎంతో మందితో మోహన్ చెప్పాడని ఆయన గుర్తుచేశారు. ఫోన్‌లో తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, మర్యాదగా మాట్లాడితే తాను కూడా మర్యాదిస్తానని చెప్పానని అన్నారు. తమ్మినేని సీతారం దిగజారిన వ్యక్తి అని, ఫ్రాడ్ ఫెలో అని వ్యాఖ్యానించారు.