- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ ప్రకటనపై భారత్ మండిపాటు
by Shamantha N |
X
న్యూఢిల్లీ: మరణశిక్షపై రివ్యూ పిటిషన్ వేయడానికి కుల్‌భూషణ్ జాదవ్ తిరస్కరించాడని పాకిస్తాన్ చేసిన ప్రకటనపై భారత్ మండిపడింది. రివ్యూ పిటిషన్ వేయకుండా అతనిపై పాక్ ఒత్తిడి పెంచినట్టు తెలుస్తున్నదని తెలిపింది. నాలుగేళ్లుగా పాకిస్తాన్ ఆడుతున్న నాటకంలో కొనసాగింపే ఈ ప్రకటన అని విమర్శించింది. కుల్‌భూషణ్ జాదవ్ కేసు విచారణ అసంబద్ధంగా సాగిందని, ఆ విచారణలోనే అతనికి మరణశిక్ష పడిందని తెలిపింది. అప్పటి నుంచి పాకిస్తాన్ మిలిటరీ కస్టడీలోనే జాదవ్ ఉన్నాడని పేర్కొంది. ఈ రివ్యూ పిటిషన్ వేయకుండా పాకిస్తాన్ అధికారులు అతన్ని బలవంతపెట్టారని తెలుస్తున్నదని వివరించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను అనుసరించామని చెప్పుకోవడానికి పాకిస్తాన్ ఈ నాటకం వేసిందని, కోర్టు ఆయనకు అందించిన లీగల్ రైట్‌నూ కాలరాసిందని విమర్శించింది.
Advertisement
Next Story