అమ్మాయిలు గొంతెత్తాలి : కేటీఆర్

by Shyam |
అమ్మాయిలు గొంతెత్తాలి : కేటీఆర్
X

సిరిసిల్ల పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని గురువారం మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బాలికలను వేదింపులకు గురిచేసిన వారిని సస్పెండ్ చేశామన్నారు. ఇలాంటి దురాగతాలకు పాల్పడే ఘటనలపై అమ్మాయిలు గొంతెత్తాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలను వేధించిన దేవయ్యపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వసతిగృహాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed