అవసరమైతే విశాఖ వెళ్తా: కేటీఆర్

by Shyam |
అవసరమైతే విశాఖ వెళ్తా: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్ట్రీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో జరుగుతున్న ఉద్యమానికి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు ఇస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రైవేట్, విద్యా సంస్థల యాజమాన్యాల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై కేటీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చివరికి రాష్ట్రాలను కూడా ప్రైవేటుపరం చేసేలా ఉందని కేటీఆర్ ఆరోపించారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు జరుగుతున్న క్రమంలో విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. సెటిలర్ల గ్రాడ్యుయేట్ల ఓట్లను ఆకట్టుకునేందుకు కేటీఆర్ ఇలా ప్రకటన చేశారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed