సాహసోపేత సంస్కరణలు చేపట్టండి

by Shyam |
సాహసోపేత సంస్కరణలు చేపట్టండి
X

– పీయూష్ గోయల్‌కు కేటీఆర్ లేఖ

దిశ, న్యూస్‌బ్యూరో : దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు సాహసోపేత సంస్కరణలను అత్యవసరంగా చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే, కామర్స్ మంత్రి పీయూష్ గోయల్‌కు శుక్రవారం లేఖ రాశారు. హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్ లాంటి మరిన్ని భారీ పారిశ్రామిక పార్కులను దేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. ఎంఎస్ఎంఈ‌లకు నేరుగా ఆర్థిక సహాయం చేయాలని, దేశ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికరంగంపై ప్రస్తుత పరిస్థితుల్లో మార్గదర్శనం చేసేందుకుగాను ఎంపవర్డ్ స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధి వంటి చర్యలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. పాతబడిన లేబర్, దివాలా చట్టాలను వెంటనే మార్చాలని, ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

Tags : ktr, letter, piyush goyal, economy, advises

Advertisement

Next Story