బయోఏషియా-2021 సదస్సులో కేటీఆర్ మాట ఇదే..!

by Shyam |   ( Updated:2021-02-22 08:21:57.0  )
బయోఏషియా-2021 సదస్సులో కేటీఆర్ మాట ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఎదురు లేదని, ప్రపంచమంతా తమ వైపే చూస్తున్నదని, ఈ క్రమంలో త్వరలోనే సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పార్కును నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా-2021 సదస్సును బేగంపేట్ వైస్ సిటీ కాకతీయలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధి సాధించిందని, ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌ను చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. భారత్ బయోమెట్రిక్ సమస్త కొవాగ్జిన్ టీకాను తీసుకొచ్చిందని, విదేశీ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమన్నారు.

ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఫార్మా సెక్టార్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్, బీ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమం రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి 30 వేల మంది జీవన శాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్స్ కంపెనీల ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఫార్మా రంగం, అభివృద్ధి, ఆరోగ్యరంగంపై కీలక చర్చలు జరపనున్నారు. జీవశాస్త్ర పరిశోధకులు ఆవిష్కరణలపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.

Advertisement

Next Story