కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు

by Ramesh Goud |
KTR
X

దిశ, హైదరాబాద్: నగరంలో చేపడుతున్న పలు ప్రాజెక్టు పనులపై మంత్రి కేటీఆర్ సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. అనంతరం దుర్గం చెరువుపైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులపై అక్కడి కాంట్రాక్ట్ ఏజెన్సీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చేపట్టవలసిన సుందరీకరణ పనులు, లైటింగ్ వంటి అంశాలపైన ఇప్పటినుంచే పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారు. పనులను మరింత వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

tag: ktr, sudden tour, hyderabad

Advertisement

Next Story

Most Viewed