‘కృతి’ హార్ట్ ఫెల్ట్ నోట్..

by Shyam |
‘కృతి’ హార్ట్ ఫెల్ట్ నోట్..
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్.. సుశాంత్ ఆత్మహత్య ఘటనను ఇంకా నమ్మలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘సుశాంత్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను’ అంటూ తన కో స్టార్ అండ్ ఫ్రెండ్ కృతి సనన్ హార్ట్ ఫెల్ట్ నోట్‌తో నివాళి అర్పించింది.

‘సుష్.. నాకు తెలుసు. నీ బ్రిలియంట్ మైండ్ నీకెంత గొప్ప బెస్ట్ ఫ్రెండో అంత చెత్త శత్రువు కూడా. కానీ నువు చేసిన ఈ పని నన్ను ముక్కలు చేస్తోంది. ఆ మూమెంట్‌లో జీవించడం కన్నా చనిపోవడం చాలా సులభమని ఎందుకు అనుకున్నావో అంతు పట్టడం లేదు. కానీ ఆ క్షణం నిన్ను ప్రేమిస్తున్న వారి గురించి ఆలోచించి ఉంటే బాగుండేదేమో. నీ లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నా.. కానీ చేయలేకపోయాను. నీ మరణంతో నా హృదయంలో ఒక భాగం నీతో పాటే వెళ్లిపోయింది. మరో భాగం నిన్ను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. నీ ఆనందం కోసం ప్రార్థించడం ఎప్పుడూ ఆపలేదు.. ఆపను కూడా..’ అని తెలిపింది. తనతో ఉన్న ఫోటోలు షేర్ చేసి నివాళులు అర్పించింది.

https://www.instagram.com/p/CBfjuqujOnk/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story

Most Viewed