ముద్దు మీద ముద్దు.. లిప్ లాక్ డోస్ పెంచిన కృతి శెట్టి

by Shyam |   ( Updated:2021-12-15 07:09:59.0  )
Krithi Shetty
X

దిశ, సినిమా : తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. కెరియర్ మొదట్లోనే సక్సెస్‌ఫుల్ హీరోస్ నాని, నాగచైతన్య లాంటి వారి పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన భామ.. ఫస్ట్ ఫిల్మ్‌లో పల్లెటూరి తెలుగు అమ్మాయిగా కనిపించి అందరి ఆదరణలు పొందింది.

కానీ తర్వాత వస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’లో మాత్రం మోడ్రన్‌గా కనిపిస్తూ.. నానితో లిప్ లాక్‌కు కూడా ఓకే చెప్పింది. తాజాగా రిలీజైన ట్రైలర్‌తో పాటు అంతకు ముందు విడుదలైన రొమాంటిక్ సాంగ్‌లో నానికి ముద్దు పెట్టేసింది. ఇదంతా అబ్జర్వ్ చేసిన నెటిజన్లు.. బేబమ్మ ఒక్క సినిమాకే ఇంత గ్రో అప్ అయింది కదా అంటున్నారు. బేబమ్మ మరీ ఇంత రొమాంటిక్‌గా కనిపిస్తుందని అనుకోలేదంటున్నారు.

సెక్స్ గురించి తెలుసుకునేందుకు 11 ఏళ్లకే పోర్న్ వీడియోలు చూశా : స్టార్ సింగర్

Advertisement

Next Story