నిర్మాతలకు మహేశ్ హీరోయిన్ రిక్వెస్ట్..

by Jakkula Samataha |   ( Updated:2023-08-18 15:44:34.0  )
నిర్మాతలకు మహేశ్ హీరోయిన్ రిక్వెస్ట్..
X

మహేశ్ బాబు ‘వన్(నేనొక్కడినే)’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్. ప్రస్తుతం విభిన్న పాత్రలతో బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న కృతి.. సినీ వర్కర్ల కష్టాలు చూసి చలించిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భామ.. దయచేసి వర్కర్లను మోసం చేయకుండా వారి డబ్బులు వారికి చెల్లించాలని నిర్మాతలను కోరుతోంది. సినీ, టీవీ వర్కర్స్ అసోసియేషన్.. మోసపోతున్న కార్మికులకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed