ప్రభాస్ సిగ్గుపడుతున్నాడని అనుకున్నా.. కానీ : కృతి

by Shyam |
ప్రభాస్ సిగ్గుపడుతున్నాడని అనుకున్నా.. కానీ : కృతి
X

దిశ, సినిమా : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ సెట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో సీతమ్మ పాత్రకు ఈ మధ్యే కన్‌ఫర్మ్ అయిన కృతి.. డార్లింగ్‌పై ఫస్ట్ ఇంప్రెషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘తనను ఫస్ట్ టైమ్ మీట్ అయినప్పుడు సిగ్గుపడుతున్నాడని అనుకున్నా. కానీ ఒక్కసారి మాట్లాడటం స్టార్ట్ చేశాక మాట్లాడుతూనే ఉన్నా’ అని చెప్పింది. ప్రభాస్ ఫుడీ అని.. తన కోస్టార్స్‌కు దగ్గరుండి మరీ తినిపించేందుకు ఇష్టపడతాడని చెప్పుకొచ్చింది కృతి.

ఇక ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన కృతి.. పురాణాలు, ఇతిహాసాలను తెరమీదకు తీసుకొచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీపై కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుందని.. కానీ దర్శకుడు ఓమ్ రౌత్ కాబట్టి తనకు అలాంటి భయాలేవీ లేదని చెప్పింది. సినిమా మీద డైరెక్టర్‌కు ఉన్న క్లారిటీ, టెక్నికల్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్స్ తనకు నచ్చిందన్న కృతి.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed