- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అద్దె గర్భానికి ఓకే చెప్పిన హీరోయిన్
దిశ, సినిమా: మెయిన్‌స్ట్రీమ్ ఫిల్మ్‌లో సరోగసీ సబ్జెక్ట్‌ను డీల్ చేయడం ఇబ్బందే. ‘అద్దె గర్భం’ కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి హిట్ కొట్టడం ఈజీ కానే కాదు. కానీ కృతి సనన్, పంకజ్ త్రిపాఠి మెయిన్ లీడ్ ప్లే చేస్తున్న ‘మిమి’ చిత్రం సక్సెస్ అవుతుందని ట్రైలర్ ద్వారా చెప్పొచ్చు. సరోగసీ అంటే ఏ మాత్రం నాలెడ్జ్ లేని అమ్మాయి.. అగ్రిమెంట్‌కు ఓకే చెప్పిన తర్వాత సాగే ఎమోషనల్ జర్నీని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా నడిపించగలిగాడని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటెకర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది కృతి. అసలు అద్దె గర్భం ఏంటో తెలియని, ఒకవేళ తెలిసినా దాని గురించి మాట్లాడేందుకు సంకోచించే గ్రామాల్లో ‘సరోగసి’ తప్పు అనే అభిప్రాయాన్ని మార్చేందుకు ఈ సినిమా సహాయపడుతుందని వివరించింది. ప్రజల మనస్తత్వాన్ని మారుస్తూ సమాజంలో మార్పు తీసుకురావడంలో సినిమాలు పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయన్న కృతి.. మాట్లాడేందుకు ఇష్టపడని అంశాలపై చర్చను లేవనెత్తేందుకు ప్రోత్సహిస్తాయని అభిప్రాయపడింది. అది మరింత ఎంటర్‌టైన్మెంట్ యాడ్ చేసి చెప్పగలిగితే ఇంపాక్ట్ ఉంటుందన్న కృతి.. ఇప్పటి వరకు చేసిన రోల్స్‌లో ‘మిమి’ చాలా డిఫికల్ట్ అని చెప్పింది.
ప్రతీ సినిమాను రెండు పార్ట్‌లుగా విభజిస్తానని.. ఒకటి హ్యాపీ షెడ్యూల్, రెండు సాడ్ షెడ్యూల్ అని తెలిపింది. ఫస్ట్ షెడ్యూల్‌లో మేనరిజం ఫాలో అయిపోతూ చేసే సీన్స్‌తో హ్యాపీగా గడిచిపోయిందని, కానీ సెకండ్ షెడ్యూల్‌కు వచ్చే సరికి ప్రెగ్నెంట్ లేడీ ఫేస్‌లా కనిపించేందుకు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చిందని వివరించింది. ఎక్సర్సైజ్ జోలికి పోకుండా, ఆకలి లేకున్నా ఫుడ్ తినాల్సి వచ్చేదని చెప్పింది. ఈ సమయంలో తల్లికాబోయే మహిళ ఎలా ఫీల్ అవుతుందనే విషయం బాగా అర్థమైందని వివరించింది. ముఖ్యంగా తల్లి అయ్యేందుకు ప్రిపేర్ కానివారికి ఈ జర్నీ చాలా కష్టంగా ఉంటుందని చెప్పింది. యాక్టర్ కావాలనుకున్న ‘మిమి’.. సరోగేట్ మదర్ అగ్రిమెంట్ ద్వారా వచ్చే డబ్బుతో తన డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవాలనుకుంటుంది. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి అనేది సినిమా అని, దీంతో సెకండ్ షెడ్యూల్ చాలా భారంగా గడిచిందని చెప్పింది కృతి. కానీ ఇందుకోసం చేసిన ప్రతీ పని సంతృప్తినిచ్చిందని తెలిపింది.