- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు రాష్ట్రాలతో కృష్ణాబోర్డు సమావేశం
దిశ, న్యూస్‌బ్యూరో: చెన్నైకి తాగునీటి సరఫరా అంశంపై కృష్ణాబోర్డు సమావేశమయ్యేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు ఐదు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. గతంలోనే దీనిపై సమాచారం పంపించిన బోర్డు తాజాగా ఎజెండా అంశాలను ఐదు రాష్ట్రాలకు బుధవారం పంపించింది. ప్రతి ఏటా సమస్యగా మారుతున్న చెన్నై తాగునీటి సరఫరా అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో జరిగే ఈ సమావేశంలో పలు ఎజెండా అంశాలను పేర్కొన్నారు.
కండలేరు ద్వారా చెన్నై సమీపంలోని పూండి రిజర్వాయరుకు నీటిని చెన్నైకి తాగునీటి కోసం సరఫరా చేస్తున్నారు. అయితే చెన్నైకి పంపించే తాగునీటిని మధ్యలోనే భారీ ఎత్తున సాగునీటికి వినియోగిస్తున్నారని, దీంతో నీరు సరైన విధంగా రావడం లేదని, తాగునీరు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రధాన ఎజెండాగా బోర్డు ముందు ఉంచింది. దీంతో పాటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అన్ని రాష్ట్రాలు 2008-09 నుంచి 2017-18 వరకు చెన్నై తాగునీటి సరఫరాకు సంబంధించిన కృష్ణా, తుంగభద్ర, భీమా నదులతో పాటు కండలేరు దాకా సెన్సార్లు ఏర్పాటు చేయాలని తమిళనాడు డిమాండ్ చేస్తోంది. అయితే దీనికి ఎలాంటి ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఈసారి బోర్డు సమావేశంలో దీనిపై చర్చించేందుకు సిద్ధమైంది.