న్యూ ఇయర్ ట్రీట్ ఫ్రమ్ ‘క్రాక్’

by Jakkula Samataha |
న్యూ ఇయర్ ట్రీట్ ఫ్రమ్ ‘క్రాక్’
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ జనవరి 1న ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. తన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ట్రైలర్‌ను కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ చేస్తూ.. న్యూ ఇయర్ ఫన్ డబుల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా.. శ్రుతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సరస్వతీ ఫిల్మ్స్ డివిజన్‌ నిర్మిస్తున్న సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించగా ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయింది. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది.
https://twitter.com/RaviTeja_offl/status/1343520688611594240?s=20

Next Story