- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గుంజేడు’.. మనసు గుంజేను!
దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పాకాల కొత్తగూడెం మండలం గుంజేడు శివారులో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ముసలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో జాతరగా పేరొందింది. ఆదివాసీ సంప్రదాయాల ఆధారంగా నిర్వహించే ఈ జాతరలో శుక్రవారం మాత్రమే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోయ తెగకు చెందిన తోలెం వంశీయులు వడ్డెలు (పూజారులు)గా ఉండి పూజలు చేస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అత్యంత వైభవంగా జరిగే మసలమ్మ జాతర ( మార్చి 4 నుంచి 6 వరకు ) ఇవాళ ప్రారంభమై శుక్రవారం వరకు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి గిరిజన, గిరిజనేతర భక్తులు వేల సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతిసారి జాతర ఆదాయం రూ.25 లక్షలకు పైగా వస్తున్నా ఆదివాసీల అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడటం లేదని విమర్శలున్నాయి. 2012 నుంచి ముసలమ్మ జాతర దేవాదాయ పరిధిలోకి వచ్చిన తర్వాత ఆరుగురు పూజారులను నియమించినప్పటికీ వీరిలో కేవలం ముగ్గురిని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది. జాతర కార్యనిర్వహణ అధికారిని ఆదివాసీని నియమించాల్సి ఉంది. గుంజేడు పరిసర ప్రాంతం దట్టమైన అడవిలో ఉండటం వల్ల అక్కడి పక్షుల కిలకిల రాగలు, గలగల పారే సెలయేర్లు, పచ్చని చెట్ల కింద భక్తులు సేదతీరుతారు.
జాతరకు చారిత్రక ఆధారాలు
గుంజేడు ముసలమ్మ జాతరకు చారిత్రక ఆధారాలున్నట్టు తెలుస్తోంది. 12వ శతాబ్దం కాకతీయుల పరిపాలనలో చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతం నుంచి ముసలమ్మ గుంజేడు చేరిందనీ, అప్పట్లోనే ముసలమ్మ కుటుంబంతో సహా బస్తర్ నుంచి వచ్చిన క్రమంలో ధన రాశులు, మణిమాణిక్యాలు కలిగిన వీరిని పిండారి దండు (దోపిడీ ముఠా) వెంటాడింది. దీంతో అడ్డుకోబోయిన ముసలమ్మ చెల్లెలు ముత్యాలమ్మ ముక్కు చెవులు కోశారు దుండగులు. ఆగ్రహించిన ముసలమ్మ తన శక్తితో వారిని శపించి తన సంపదను తిరిగి లాక్కొని రాళ్లగుట్టపైకి వెళ్లి అదృశ్యమైనట్లు కోయ పెద్దలు చెబుతున్నారు. వాగు అంచున చెట్టు వేళ్లకు ఏర్పడిన ప్రతిమ ఆధారంగా గిరిజనులు చెట్టు వద్దనే పూజలు చేయడం ప్రారంభించారు. ముసలమ్మ తల్లి మన్ననలు పొంది, దేవత అనుగ్రహం కలిగిన వారికి సంతానం, సంపద, పంటపొలాలు,ధాన్యం, వ్యాపారం, ఉద్యోగం వంటి కోరికలు తీరుతాయని ప్రచారం జరిగింది. దీంతో భక్తుల సందర్శన పెరిగింది. ప్రతి శుక్రవారం వచ్చే భక్తులు శివసత్తులు పూనకాలు ఊగుతూ అడుగుల సవ్వడిలో చిందులు వేస్తూ అమ్మ తరిస్తూ దర్శించుకుంటారు.
ప్రకృతి ఆరాధానే జాతర..
గుంజేడు జాతర అనేది ప్రకృతి ఆరాధన పండుగ, విగ్రహారాధన లేని హిందూయిజానికి, బ్రాహ్మణానికి సుదూరమైన జాతర. కానీ, ఇప్పుడు జాతర గిరిజనేతర సంస్కృతి, ఆరాధనలో పాటు దేవాదాయశాఖ పరిధిలోనికి వెళ్లింది. గిరిజనేతర వ్యాపారులు కొందరు దాతలుగా, దేవత విగ్రహాన్ని, గుడి గోపురాన్ని, తోరణాలను ఏర్పాటు చేస్తారు. జాతర ప్రభుత్వ హయాంలోకి వచ్చనా కనీస సౌకర్యాలు లేవనీ, అవి కల్పించాలని కోయలు డిమాండ్ చేస్తున్నారు.
tags : koya gold festival, gunjedu musalamma fair, warangal dist