కామ్రేడ్ మూమెంట్.. చరణ్‌పై చెయ్యేసిన చిరు

by Jakkula Samataha |
కామ్రేడ్ మూమెంట్.. చరణ్‌పై చెయ్యేసిన చిరు
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషనలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌లో చిరంజీవి, చరణ్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. తాజాగా రామ్‌చరణ్‌ ఫొటోను ‘ఆచార్య ‘సిద్ధ’మవుతున్నాడు’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ‘ఆచార్య’లో ‘సిద్ధ’ అనే పవర్‌పుల్‌ రోల్ ప్లే చేస్తున్న చరణ్‌.. రగ్డ్‌ లుక్‌లో కనిపిస్తుండగా, చరణ్‌ భుజంపై చిరు చెయ్యేసిన ఫొటోను చూసి మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా ఈ ఫొటోపై రామ్ చరణ్ తేజ్ కూడా స్పందించారు. ‘కామ్రేడ్‌ మూమెంట్‌.. ‘ఆచార్య’ సెట్‌లో ప్రతీ క్షణాన్ని చిరంజీవి, కొరటాల గారితో ఎంజాయ్‌ చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక రీసెంట్‌గా విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు కాగా, మే 13న మూవీ రిలీజ్ కానుంది.

Advertisement

Next Story