ఈటలతో కొండా సురేఖ దంపతుల భేటీ.. ఏం మాట్లాడారంటే.?

by Ramesh Goud |   ( Updated:2021-05-16 06:03:09.0  )
ఈటలతో కొండా సురేఖ దంపతుల భేటీ.. ఏం మాట్లాడారంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇదే సమయంలో మరో వైపు రాజకీయ వాతావరణం హీట్ పుట్టిస్తోంది. ఈటల రాజేందర్‌తో పలువురు కీలక నేతల భేటీలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఈరోజు శామీర్‌పేటలోని ఈటల రాజేందర్‌ నివాసానికి కొండా సురేఖ దంపతులు వెళ్లారు. ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలపై ఈటలతో కొండా సురేఖ దంపతులు చర్చించినట్టు సమాచారం.

అయితే, ఇప్పటికే ఈటల రాజేందర్‌తో కొద్ది రోజుల క్రితమే కొండా విశ్వే్శ్వర్ రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. పలువురు ప్రతిపక్ష నేతలు సైతం ఈటలకు మద్దుతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈటల.. కొత్త పార్టీ పెడతారా.? లేక ఇతర పార్టీలో చేరుతారా.? అనే ఆస్తక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

Advertisement
Next Story

Most Viewed