మలిదశ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ మార్గదర్శి..!

by Ramesh Goud |
మలిదశ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ మార్గదర్శి..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్:

తెలంగాణ కోసం మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శనీయుడని టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని కొనియాడారు. సోమవారం కొండా లక్ష్మణ్ బాపుజీ 8వ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజీబ్ హుసేని మాట్లాడుతూ.. తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల కోసం శ్రమించిన సామాజికవేత్త కొండా లక్ష్మణ్ బాపుజీ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story