బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా

by Anukaran |
బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 32వ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇప్పటికే 7 మ్యాచులు ఆడిన ముంబై 5 విజయాలు, 2 ఓటములు ఖాతాలో వేసుకుంది. ముంబై బ్యాటింగ్, బౌలింగ్ ముందు నుంచి సమిష్ఠిగా రాణిస్తున్నారు. చిన్న చిన్న తప్పిదాల కారణంగానే ముంబై రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక ఈ రోజు మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలని ముంబై తహతహలాడుతోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే 7 మ్యాచులు ఆడి నాలిగింట్లో విజయం సాధించింది. మూడింట్లో పరాజయం చెందింది. అయితే, తన కెప్టెన్సీ నిర్వహణ పై ఒత్తిడికి గురైన దినేష్ కార్తీక్ ఆ బాధ్యతలను ఇయాన్ మోర్గాన్ కట్టబెట్టాడు. దీంతో ఈ రోజు మ్యాచ్ మరింత ఆసక్తిని రేపుతోంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో కోల్‌కతా ఎటువంటి ఫలితాలను సాధిస్తుందో వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed