- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లండ్‌పై కోహ్లీ హవా.. మళ్లీ హాఫ్ సెంచరీ
దిశ, వెబ్‌డెస్క్: పుణె వేదికగా ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరిశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి జట్టుకు పరుగులు తెప్పించాడు. ఇది వన్డేల్లో కోహ్లీకి 61వ హాఫ్ సెంచరీ.
కెప్టెన్‌గా తన రోల్‌ని కోహ్లీ అద్భుతంగా పోషిస్తున్నాడు. ఇటీవల టీ20ల్లో జట్టు ఆపద కాలంలో ఉన్న సమయంలో ఆదుకుని తన ఫర్‌ఫామెన్స్‌తో మెస్మరైజ్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న తొలి వన్డేలో కూడా జట్టును ఆదుకుంటున్నాడు.
మొదటి 13 ఓవర్ల వరకు భారత్‌కు అంతగా పరుగులు రాలేదు. ఇంగ్లండ్ బౌలర్లు ధీటుగా బౌలింగ్ వేయడంతో.. మొదట్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తడబడ్డారు. రోహిత్ శర్మ ఔట్ అయి కోహ్లీ బ్యాటింగ్‌కు దిగిన తర్వాత టీమిండియా రన్‌రేట్ పెరిగింది. టీ20ల్లో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన కోహ్లీ.. ఇప్పుడు వన్డేలో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు.