- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లి ఒక రోల్ మోడల్ : ఐసీసీ మాజీ అంపైర్
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక రోల్ మోడల్ అని ఐసీసీ మాజీ అంపైర్ ఇయాన్ గౌల్డ్ అన్నాడు. దేశం మొత్తం అతడి వెంట ఉంది. ఆ విషయం చాలా మందికి తెలియదని గౌల్డ్ అభిప్రాయపడ్డాడు. కొన్నిసార్లు కోహ్లి తనలా బ్యాటింగ్ చేశాడని, దాన్ని కొనసాగించమని చెప్పి ఉండాల్సిందని గౌల్డ్ చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌లా కనిపిస్తుంటాడని గౌల్డ్ అన్నాడు. కోహ్లి చాలా ఫన్నీ క్రికెటర్ అని, చాలా మంచి మాటకారని, అతడితో కూర్చుని గంటల కొద్దీ మాట్లాడవచ్చని గౌల్డ్ చెప్పాడు. మైదానంలో దూకుడుగా ఉంటాడనేది నిజమే. అయినా అతను బయట ఎంతో గౌరవం సంపాదించుకున్న క్రికెటర్ అని ఈ మాజీ అంపైర్ చెప్పాడు. కోహ్లి ఒక్కడే కాదు, భారత జట్టుకు ఆడే ప్రతి ఆటగాడు చక్కని మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పాడు. 13 ఏళ్లపాటు ఐసీసీ ప్యాన్ ఆఫ్ ఎలైట్ అంపైర్స్ బాధ్యతల నుంచి గౌల్డ్ గత ఏడాది రిటైర్ అయ్యాడు.