ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ మార్క్

by Shiva |   ( Updated:2021-03-17 09:52:03.0  )
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ మార్క్
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన మార్క్ చూపించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టాప్ – 5 లో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు అర్దసెంచరీలు నమోదు చేశాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. మరోవైపు వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోహ్లీ, టెస్టుల్లో నెంబర్ 5 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో టాప్ 5లో కొనసాగుతున్న ఏకైక బ్యాట్స్‌మాన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. మరోవైపు కేఎల్ రాహుల్ తొలి మూడు టీ20ల్లో విఫలం కావడంతో ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగవ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 31వ ర్యాంకులో, రిషబ్ పంత్ 80వ ర్యాంకుకు చేరుకున్నారు.

టాప్ 5 ర్యాంకులు

వన్డే బ్యాట్స్‌మెన్

1. విరాట్ కోహ్లీ
2. రోహిత్ శర్మ
3. బాబర్ ఆజమ్
4. రాస్ టేలర్
5. ఆరోన్ ఫించ్

వన్డే బౌలర్లు

1. ట్రెంట్ బౌల్ట్
2. ముజీబుర్ రెహ్మాన్
3. జస్ప్రిత్ బుమ్రా
4. మెహెదీ హసన్
5. క్రిస్ వోక్స్

వన్డే ఆల్‌రౌండర్లు

1. షకీబుల్ హసన్
2. మహ్మద్ నబీ
3. క్రిస్ వోక్స్
4. బెన్ స్టోక్స్
5. ఇమాద్ వాసిమ్

టీ20 టాప్ 5 ర్యాంకులు

టీ20 బ్యాట్స్‌మాన్

1. డేవిడ్ మలన్
2. ఆరోన్ ఫించ్
3. బాబర్ ఆజమ్
4, కేఎల్ రాహుల్
5. విరాట్ కోహ్లీ

టీ20 బౌలర్లు

1. రషీద్ ఖాన్
2. తబ్రిజ్ శంషీ
3. ముజీబుర్ రెహ్మాన్
4. ఆష్టన్ అగర్
5. ఆదిల్ రషీద్

టీ20 ఆల్‌రౌండర్లు

1. మహ్మద్ నబీ
2. షకీబుల్ హసన్
3. గ్లెన్ మ్యాక్స్‌వెల్
4. రిచర్డ్ బెర్రింగ్టన్
5. షాన్ విలియమ్స్

టాప్ 5 టెస్ట్ ర్యాంకులు

టెస్ట్ బ్యాట్స్‌మాన్

1. కేన్ విలియమ్‌సన్
2. స్టీవ్ స్మిత్
3. మార్నస్ లబుషేన్
4. జో రూట్
5. విరాట్ కోహ్లీ

టెస్ట్ బౌలర్లు

1. పాట్ కమ్మిన్స్
2. రవిచంద్రన్ అశ్విన్
3. నీల్ వాగ్నర్
4. జేమ్స్ అండర్సన్
5. జోష్ హాజెల్‌వుడ్

టెస్ట్ ఆల్‌రౌండర్లు

1. జేసన్ హోల్డర్
2. బెన్ స్టోక్స్
3. రవీంద్ర జడేజా
4. రవిచంద్రన్ అశ్విన్
4. షకీబుల్ హసన్

Advertisement

Next Story

Most Viewed