- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలది ఔటే కాదంటూ.. థార్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, ద్రావిడ్ షాక్..
దిశ, వెబ్‌డెస్క్ : ముంబాయి వేదికగా భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ ఔటైన విధానం అందరిని షాక్ కు గురయ్యేలా చేసింది. అజాజ్ పటేల్ వేసిన 30వ ఓవర్‌లో కోహ్లీ ఢిపెన్స్ చేయడానికి ప్రయత్నించగా బంతి మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్ అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న అనిల్ చౌదరి దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే వెంటనే కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో అన్నీ కోణాల్లో విజువల్స్ పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు దాన్ని నిర్ధారించడం కష్టంగా మారింది.
రీప్లేలో, ఒక స్పైక్ కనిపించినప్పటికీ, బంతి మొదట బ్యాట్‌కి తగిలిందా లేదా ప్యాడ్‌కు తగిలిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్‌లను తాకడంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీతో పాటు కోచ్ ద్రవిడ్ కూడా అసంతృప్తి చెందాడు. దీంతో ఈ నిర్ణయంపై షాక్‌లో ఉన్న అభిమానులు మాత్రం అసలు అది ఔటే కాదంటు, బాల్ ఫస్ట్ బ్యాటునే తాకిందటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.