- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య నిపుణులతో కమిటీ వేయాలి
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణ చర్యలపై వైద్య నిపుణులతో కమిటీ వేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జూడాలు, ప్రజలు పోట్లాడుకునే దౌర్భాగ్యమైన పరిస్థతి తలెత్తిందని ఆయన మండిపడ్డారు. టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో వైద్యరంగ నిపుణులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ. రాష్ట్రంలో 4 కోట్ల జనాభాకు ఒక గాంధీ ఆసుపత్రి ఎలా సరిపోతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో 15 మెడికల్ కాలేజీల్లో ప్రతి కాలేజీలో 600 పడకలు ఉండాలి, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. అట్టహాసంగా ప్రకటించిన గచ్చిబౌలి టీమ్స్‌లో ఒక డాక్టర్ కూడా లేరని ఎద్దేవా చేశారు. సీఎంకు వాస్తవాలు తెలియాలంటే జూనియర్ డాక్టర్లు, పీజీలు, సూపరింటెండెంట్, ఇతర వైద్య నిపుణులతో కమిటీ వేయాలని సూచించారు. వివరాలు తెప్పించుకోని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ వైద్యరంగ నిపుణులు డా.సంజీవ్ సింగ్ యాదవ్, డా. వెంకటరత్నం, డా. నందకుమార్‌రెడ్డి, డా. ప్రమీల తదితరులు పాల్గొన్నారు.