నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు

by Shyam |
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాలు చేపట్టని కేసీఆర్‌పై నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఏజెన్సీలో పోడు రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని, ఎన్నికలకు ముందు రైతులకు పోడు పట్టాలిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

Advertisement

Next Story